గీత కార్మికుల ఉపాధికి చర్యలు తీసుకోండి

గీత కార్మికుల ఉపాధికి చర్యలు తీసుకోండి
  • కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ 

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని, వీరి ఉపాధికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ డిమాండ్ చేశారు.  బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  బెల్లంకొండ వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వృత్తిలో ఉపాధి మెరుగుపడాలంటే ప్రధానంగా చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలని, కల్లుకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బొలగాని జయరాములు, చౌగాని సీతారాములు, ఎస్ రమేశ్ గౌడ్, గాలి అంజయ్య, మడ్డి అంజిబాబు, బాల్నే వెంకట మల్లయ్య, బండ కింది అరుణ్, వి. వెంకట నరసయ్య  పాల్గొన్నారు.