నంబర్ ప్లేట్ లేని వెహికల్స్​పై చర్యలు తీసుకుంటాం: సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత

నంబర్ ప్లేట్ లేని వెహికల్స్​పై చర్యలు తీసుకుంటాం: సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత

సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలో నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వెహికల్స్​పై చర్యలు తీసుకుంటామని సిద్దిపేట సీపీ. ఎన్. శ్వేత చెప్పారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో  సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల పట్టణాలతో పాటు మండలాలలో కొంతమంది వారి వాహనాలకు ఆర్టీవో నిర్దేశించిన నంబర్ ప్లేట్ కాక ఎగుడుదిగుడు, ప్లేట్లు మార్ఫింగ్, అసులు నంబర్​ లేకుండా ఉంటున్నారని తెలిపారు. 

ఈ విషయమై జనవరి నుంచి 3,925 వాహనాల యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించామని,  కేసులు నమోదు చేశామన్నారు. వాహనదారులు ఆర్టీవో చట్టప్రకారం నంబర్ ప్లేట్లు బిగించుకోవాలని, హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.