పాల్వంచ మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ

పాల్వంచ మున్సిపల్ కమిషనర్ బాధ్యతల స్వీకరణ

పాల్వంచ, వెలుగు : ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదిలీ ల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన అజ్మీర స్వామి గుండ్ల పోచంపల్లికి బదిలీ అయ్యారు. ఆయన స్థానం లో జీహెచ్ఎంసీ స్పెషల్ గ్రేడ్ కమిషనర్ గా పనిచేస్తున్న డాకు నాయక్ ను నియమించారు. ఈ మేరకు ఆయన సోమ వారం విధుల్లో చేరారు. నూతన కమిషనర్ కు మున్సిపల్ డీఈ స్వరూప రాణి, మేనేజర్ ఎల్ వీ సత్యనారాయణ, టీపీవో ఎం.సత్యనారాయణ

శానిటరీ ఇన్​స్పెక్టర్ లక్ష్మణరావు, టీపీవో 2లు నవీన్, పాలడుగు రవి, సూరిబాబులు స్వాగతం పలికారు. ఆయనను మెప్మా సీవోలు ఉపేంద ర్, బుజ్జి, అక్షయ స్వచ్ఛంద  సంస్థ అధ్యక్షుడు కటుకూరి శేఖర్ బాబు, మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్ సింధూ తపస్వి, పుష్ప గుచ్ఛాలు అందజేశారు.