కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగితే రూ. 1000 ఫైన్

కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగితే రూ. 1000 ఫైన్

హైదరాబాద్: దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం (ఏప్రిల్ 5) జరిగిన హిట్ అండ్ రన్ లో ఒకరుమృతి, మరొకరికి తీవ్రగాయాలయిన విషయం తెలిసిందే.. ఈకేసులో మాదాపూర్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు..సెల్ఫీలకోసం రోడ్లపైకి వెళ్లడంతో యాక్సిడెంట్లు అవుతున్నాయన్నారు. దుర్గం చెరువు బ్రిడ్జి సెల్ఫీలకోసం ఏర్పాటు చేసిం దికాదు..వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేశారు.ఎవరైనా సెల్ఫీలకోసం రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సెల్ఫీలు దిగితే జరిమానాతోపాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో అనిల్, అజయ్ ఇనే ఇద్దరు స్నేహితులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. అనిల్ స్పాట్ లోనే మృతిచెందగా అజయ్ ని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. అజయ్ పరిస్థితి విషమంగా ఉంది. అనిల్ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తున్నారు. నిందితుడు కారు డ్రైవర్ పరారీలో ఉన్నారు.. కారు ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సెల్ఫీలు దిగేందుకు దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జీపై వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు మాదాపూర్ సీఐ మల్లేష్..సెల్ఫీలకోసం రోడ్లపైకి రావడంతో తరుచుగా ప్రమాదా లు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీలకోసం దుర్గంచెరువు మీదకు వస్తే వెయ్యిరూపాయలు జరిమానాతోపాటు కేసు నమోదు చేస్తామని హెచ్చ రిస్తు న్నారు.