ఓటు వేస్తూ వీడియో తీసిన ఓటర్ : పోలింగ్ బూత్ లో గొడవ

లోక్ సభ ఎన్నికల్లో ఓ ఓటర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ఓటు వేస్తూ వీడియో తీశాడు.  ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.  నెల్లికుదుర్ మండలం  హేమ్లతాండ పోలింగ్ బూత్ 160 లో ఓటు వేసే దృశ్యాలను మొబైల్ లో తీశాడు  బాలకృష్ణ అనే ఓటర్.  బాలకృష్ణ తండ్రి గ్రామ పంచాయతీ సిబ్బంది కావడంతో  ఫోన్తో పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన అధికారులు. 

దీంతో బాలకృష్ణ  ఓటు వేసే దృశ్యాలను వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  ఈ క్రమంలో పోలింగ్ బూత్ లో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.   వెంటనే  రంగంలోకి దిగిన పోలీసుల ఇరువురికి సర్ధిచెప్పారు.   పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తుండగా వీడియోలు తీయడం నిషిద్ధం. రహస్యంగా ఉండాల్సిన ఓటు సమాచారాన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం వివాదాస్పదం అవుతోంది.