తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి : తక్కలపల్లి శ్రీనివాసరావు

తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి : తక్కలపల్లి శ్రీనివాసరావు

ఎల్కతుర్తి, వెలుగు : రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కలపల్లి శ్రీనివాసరావు కోరారు. సీపీఐ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ప్రభుత్వం పరిశ్రమలు స్థాపించి పేదలకు ఉపాధి కల్పించాలని, ఇండ్ల స్థలాలు, పక్కా  ఇండ్లు నిర్మించేందుకు కృషి చేయాలని, విద్య, వైద్యం అందరికీ అందించాలని కోరారు. 

అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ, దేవాదుల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేసేందుకు పోరాటాలు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, మండల కార్యదర్శి ఊట్కూరి రాములు, రాష్ట్ర కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదరి శ్రీనివాస్, కర్రె లక్ష్మణ్, కామెర వెంకటరమణ, మర్రి శ్రీనివాస్, శనిగరపు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తండా మొండయ్య, నిమ్మల మనోహర్, విజయ్, ఆరెపల్లి చంద్రమౌళి, వేముల కుమారస్వామి, పెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, యాల భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.  

ముల్కనూరులో...

భీమదేవరపల్లి, వెలుగు : సీపీఐ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం హనుమకొండ జిల్లా ముల్కనూరులోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి సీపీఐ మాత్రమే ప్రత్యామ్నాయం అని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసేందుకు ప్రజలను జాగృతం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, మండల కార్యదర్శి ఆదరి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు మంచాల తిరుపతి, ఆదరి రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.