జమ్మికుంట, వెలుగు: ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, కౌన్సిలర్ల సహకారంతో జమ్మికుంట పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్మన్తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు అన్నారు.
శుక్రవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలవాలని అవిశ్వాసం ప్రవేశపెట్టిన పొనగంటి మల్లయ్యకు రాజేశ్వరరావు సవాల్ విసిరారు. తనపై నమ్మకముంచి సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ జీవితం ప్రజాసేవకే అంకితమన్నారు.