కల్వకుర్తి, వెలుగు: తమ గ్రామాన్ని మండలం చేయాలని తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి గ్రామస్తులు శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించారు. 6 ట్రాక్టర్లలో గ్రామ ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని నినాదాలు చేశారు. పోలీసులు వారిని శాంతిపజేసే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు వెల్జాల్ ను మండలం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ రహమాన్, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.