కోటిన్నరకే కొండగట్టు తలనీలాల టెండర్

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏడాదిపాటు తలనీలాల సేకరణకు బుధవారం టెండర్లు నిర్వహించారు. రెండు సీల్డ్ టెండర్లు రాగా, 8 మంది బహిరంగ వేలంలో పాల్గొన్నారు. వెంకట నర్సమ్మ అనే కాంట్రాక్టర్ రూ.కోటి62లక్షలకు టెండర్​దక్కించుకున్నారు. అయితే గతేడాది రూ.3.65 కోట్లు పలికిన తల నీలాల టెండర్​ను, ఈసారి అతి తక్కువ ధరకే అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి.

ఆలయానికి దాదాపు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని స్థానికులు మండిపడుతున్నారు. తలనీల టెండర్​వేలంపాట ఆరుసార్లు వాయిదా పడడంతోనే తక్కువ ధరకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. మార్కెట్​లో తలనీలాల ధర తగ్గిందని, అందుకే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.