దీక్షా దివస్​కు 3 వేల బైకులతో ర్యాలీ

  • బేగంపేటలోని పాటిగడ్డ నుంచి మొదలు
  • సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ భవన్​లో ఈ నెల 29న నిర్వహిస్తున్న దీక్షా దివస్​కు భారీ బైక్​ర్యాలీతో వెళ్తున్నట్లు సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం ఆయన మారేడుపల్లిలోని క్యాంప్​ఆఫీసులో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 29న మధ్యాహ్నం 2.30 గంటల కల్లా నియోజకవర్గంలోని బీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు బైకులపై బేగంపేటలోని పాటిగడ్డ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకోవాలని పిలపునిచ్చారు.

3 వేల బైకులతో పాటిగడ్డ నుంచి బంజారాహిల్స్​లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. అక్కడి నుంచి కాలినడకన తెలంగాణ భవన్ కు చేరుకుని దీక్షా దివస్​లో పాల్గొనాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్​శ్రేణులు తరలివస్తున్నారని, సనత్​నగర్​నుంచి అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్​ నాయకుల కొలన్ బాల్ రెడ్డి, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.