ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా?

ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా?

బీజేపీ వాళ్లు ఎంత నీతిమంతులో అందరికీ తెలుసన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మేయర్ ఎన్నికపై విపక్షాలవి పిచ్చిమాటలన్నారు. ఎంఐఎంకు ఏమైనా డిప్యూటీ మేయర్ ఇచ్చామా? అని అన్నారు. ఎంఐఎం ఏమైనా అంటరాని పార్టీనా అని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లకు అభివృద్ధిపై మాట్లాడటం చేతకాదన్నారు. ఒక్క బీజేపీ వాళ్లే హిందువులా? అని ప్రశ్నించారు. బీజేపీ అనైతిక పొత్తులను దేశమంతా చూస్తోందన్నారు. మీరు సీఎంను తిడితే తాము పీఎంను తిట్టలేమా? అన్నారు. గ్రేటర్ పీఠంలో ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు బీజేపీ తట్టుకోవడం లేదన్నారు. భవిష్యత్ లో బీజేపీ తీరు మారకపోతే తాము చూస్తూ ఉరుకోబోమన్నారు. అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో పెడితే తమ తప్పేంటన్నారు. పొత్తు పెట్టుకోవాలంటే ముందే చెప్పేవాళ్లమన్నారు. జిహెచ్ఎంసి గురించి ఎవ్వరితో- ఏ పార్టీతో టీఆర్ఎస్ సంప్రదింపులు జరపలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా రావొచ్చని.. ఎక్కడైనా పార్టీలు పెట్టొచ్చన్నారు.

see more news

ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ట్విట్టర్ కు సుప్రీం నోటీసులు