సొంతింటి కల నిజం చేసిన ఘనత బీఆర్‌‌ఎస్‌‌దే : తలసాని శ్రీనివాస్ యాదవ్

పటాన్​చెరు,వెలుగు : పేదల సొంతింటి కలను నిజం చేసిన ఘనత  బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ అన్నారు.  సోమవారం  సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు- లో మూడో విడత డబుల్​ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసారు.

ALSO READ : కడియం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నరు : రాజయ్య

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కేసీఆర్ కి తప్ప ఇంకెవరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిచ్చిన చరిత్ర లేదన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,  కలెక్టర్  శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.