అభివృద్ధిలో తెలంగాణ దేశానికే రోల్​ మోడల్ : తలసాని

 పద్మారావునగర్, వెలుగు :  తెలంగాణను అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్​గా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్​కే దక్కుతుందని సనత్​నగర్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మోండా మార్కెట్ డివిజన్ బండిమెట్, జైన్ భవన్, సజ్జన్ లాల్ స్ట్రీట్, టకారా బస్తీ, పాట్ మార్కెట్ ఏరియాల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బండిమెట్, ఆదయ్యనగర్​లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే సనత్​నగర్ సెగ్మెంట్​లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయన్నారు. రూ.1400 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. ఆయన వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్ ఉన్నారు. సాయంత్రం బన్సీలాల్ పేట డివిజన్ భోలక్ పూర్ చౌరస్తాలో నర్సింహా సైకిల్ స్టాండ్, ఎవర్ గ్రీన్ అసోసియేషన్, ఆరోగ్య సూపర్ మార్కెట్ ఏరియాల్లో తలసాని శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు.  కార్పొరేటర్​ హేమలత, నాయకులు గుర్రం పవన్​ కుమార్ గౌడ్, ఎల్. వెంకటేశన్ రాజు, బాలరాజ్ యాదవ్ పాల్గొన్నారు.

ALSO READ: స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెటావర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాటా