పేదల గుడిసెల జోలికొస్తే ఖబర్దార్..అక్రమార్కులకు ఎమ్మెల్యే తలసాని వార్నింగ్​

పేదల గుడిసెల జోలికొస్తే ఖబర్దార్..అక్రమార్కులకు ఎమ్మెల్యే తలసాని వార్నింగ్​
  •  దాసారం బస్తీ వాసులకు అండగా ఉంటామని హామీ

పద్మారావునగర్, వెలుగు: ‘పేదల గుడిసెల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోం.. అక్రమ చొరబాట్లను సహించేది లేదు.. ఖబర్దార్​అంటూ సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్రమార్కులకు వార్నింగ్ ఇచ్చారు. సనత్​నగర్​నియోజకవర్గం దాసారం బస్తీలో 30 ఏండ్లుగా దాదాపు 300 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నాయి. కాగా బుధవారం కొందరు తమ అనుచరులతో వచ్చి ఆ ప్రాంతానికి ఖాళీ చేయాలని, గుడిసెలు తొలగించాలని హెచ్చరించారు.

ఆందోళన చెందిన బస్తీ వాసులు గురువారం ఉదయం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసుకు తరలివచ్చారు. ఎన్నో ఏండ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, ఉన్నపళంగా ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని ఎమ్మెల్యే ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులతో ఫోన్​లో మాట్లాడారు. పరిస్థితిని వివరించారు. బాధితుల వెంట సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్​అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఉన్నారు.