![కబడ్డీ పోటీల్లో కాకా కాలేజీ స్టూడెంట్ల ప్రతిభ](https://static.v6velugu.com/uploads/2023/10/Talent-of-Kaka-College-students-in-Kabaddi-competitions_NGDCAUcmsq.jpg)
ముషీరాబాద్, వెలుగు: అండర్–19 కబడ్డీ బాయ్స్ పోటీల్లో కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్లు ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో రెండు రోజులపాటు అండర్–19 కబడ్డీ బాయ్స్ పోటీలు నిర్వహించారు. సిటీలోని 24 కాలేజీల నుంచి స్టూడెంట్లు పాల్గొన్నారు. గురువారం జరిగిన ఫైనల్లో కాచిగూడ గవర్నమెంట్కాలేజీ స్టూడెంట్లు ఫైనల్లో గెలుపొందగా, బాగ్‌లింగంపల్లి కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీ స్టూడెంట్లు రన్నరప్‌గా నిలిచారు. హోరాహోరీగా సాగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లును అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ సరోజా వివేక్ ప్రత్యేకంగా అభినందించారు.