పాల్వంచ రూరల్, వెలుగు : టీఎస్జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ క్యారమ్స్ అండ్చెస్టోర్నమెంట్లలో కేటీపీఎస్క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 5 నుంచి 8 వరకు జూరాల హైడల్ స్టేషన్లో నిర్వహించిన స్టేట్లెవల్చెస్, క్యారమ్స్పోటీల్లో 9 హైడల్, థర్మల్టీమ్స్పాల్గొన్నాయి.
రెండింటిలో కేటీపీఎస్7వ దశ క్రీడాకారులు టి.రాజేశ్వరరెడ్డి, ఎండీ అక్బర్, కె.సురేశ్, ఎం.సైదారావు, పి.వంశీ, బి.కృష్ణ, పి.సతీశ్ప్రతిభ కనబరిచి ట్రోఫీలు గెలుచుకున్నారు. క్రీడాకారులను 7వ దశ సీఈ పి.వెంకటేశ్వరరావు మంగళవారం అభినందించారు.