కరాటేలో లింగాపూర్ విద్యార్థుల ప్రతిభ

కడెం, వెలుగు: జిల్లా కరాటే ఛాంపియన్​షిప్–2024 పోటీల్లో లింగాపూర్ ​ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్లు సత్తా చాటారు. నిర్మల్ జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో కడెం మండలం లింగాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాహితి బంగారు పతకం, ఝాన్సీ, అక్షయ మేఘన, కాంస్య పతకాలు సాధించారు. ఈ పథకాలు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు వారిని  అభినందించారు.