మాట తప్పిన తాలిబన్లు.. పిల్లలు, మహిళలపై దాడులు

మాట తప్పిన తాలిబన్లు.. పిల్లలు, మహిళలపై దాడులు

కాబూల్: అఫ్గానిస్థాన్ ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లకు అక్కడి ప్రజలు భయపడుతున్నారు. తాలిబన్ల పాలనను తలచుకుని దేశం విడిచి పారిపోతున్నారు. అయితే శాంతియుతంగా పాలన అందిస్తామని.. మహిళల స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తామని తాలిబన్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. కానీ ఈ వాగ్దానాలు ఉట్టి మాటలేనని తేలిపోయింది. దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నిస్తున్న పౌరులపై సాయుధ తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టులోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న ప్రజల మీద తాలిబన్లు కాల్పులకు దిగిన ఫొటోలు, ఆయుధాలతో దాడులకు దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో గాయపడిన వారిలో పలువురు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. మాజీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాబూల్ వీధుల్లో తాలిబన్లు వెతుకులాడుతున్నారు.