- అఫ్గాన్ మహిళలపై తాలిబాన్ల తాజా ఆంక్షలు
కాబూల్:ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్లు మహిళలపై మరోసారి ఆంక్షలు విధించారు. మహిళలు నమాజ్ చేసేటప్పుడు పక్కనున్న మహిళలకు వినబడకూడదని ఆదేశిం చారు. ఒకరి సమక్షంలో మరొకరు బిగ్గరగా ప్రార్థన చేయడాన్ని నిషేధిస్తూ తాలిబాన్ మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఉత్తర్వులు జారీ చేశారు.
మహిళలు ఖురాన్‌ను ఇతర మహిళలు వినేలా గట్టిగా చదవకూడదని పేర్కొన్నారు. మహిళల వాయిస్ కూడా ‘అవ్రా’ కింద పరిగణిస్తామని చెప్పారు. మసీదులో మహిళలకు తక్బీర్ లేదా అజాన్‌కు అనుమతి లేనప్పుడు వారు పాడటం, సంగీతాన్ని ఆస్వాదించలేరని ఆయన పేర్కొన్నారు.
మహిళలకు విధించిన ఈ పరిమితి వల్ల వారిని ప్రజా జీవితం నుంచి మరింత దూరం చేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.