అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం : కటుకం మృత్యుంజయం

  • ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జి కటుకం

రాజన్న సిరిసిల్ల,వెలుగు : రానున్న ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణలో అన్ని నియోజక వర్గాలలో పోటీ చేస్తోందని  ఆ పార్టీ స్టేట్​ ఎన్నికల ఇన్​చార్జి కటుకం మృత్యుంజయం అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్ల లో మీడియాతో మాట్లాడారు. నేతాజీ సుభాశ్​ చంద్ర బోస్  స్ఠాపించిన  ఫార్వార్డ్  బ్లాక్ పార్టీ రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతుందన్నారు.

ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం అని చెప్పారు.  ఈ సందర్బంగా ఏఐఎఫ్ బీలో 50 మంది చేరారు. కార్యక్రమంలో ఏఐఎఫ్​ బీ జిల్లా అధ్యక్షుడు  మేకల కమలాకర్,నాయకులువరి బాబు,లక్ష్మీనారాయణ గౌడ్, వడ్లూరి చందు, నల్ల రాజ్ కుమార్, గణేశ్, సంపత్, మహేశ్​ సాయికుమార్   పాల్గొన్నారు.