నర్సాపూర్​ గర్ల్స్ హాస్టల్​లో కనీస వసతుల్లేవ్​: మురళి యాదవ్

నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ పట్టణంలోని గర్ల్స్ హాస్టల్​లో కనీస వసతులు లేక స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,  మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ తెలిపారు. మంగళవారం గర్ల్స్ హాస్టల్ ను  ఆయన తనిఖీ చేశారు. స్టూడెంట్స్​ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉండి స్థానిక గర్ల్స్ హాస్టల్​ లో టాయిలెట్స్, నీటి వసతి కల్పించకపోవడం దారుణమన్నారు.

ALSO READ :పొంగులేటి రాజకీయ అజ్ఞానిగా మిగిలిపోవడం ఖాయం: తాతా మధుసూదన్

 గదులన్నీ తేమ పట్టి గాలులకు పిల్లలు వణికిపోతున్నారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలు, బర్త్​డేలపై ఉన్న  శ్రద్ధ బడుగుల పిల్లలపై లేదని మండిపడ్డారు. వెంటనే గర్ల్స్ హాస్టల్ లో సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం స్టూడెంట్ తో కలిసి ఆయన భోజనం చేశారు.