చిరంజీవి .. విశ్వంభర మూవీ టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్

చిరంజీవి .. విశ్వంభర మూవీ టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌‌డేట్ వచ్చింది.  తాజాగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉండగా ఇప్పటికే మూడు పాటలు చిత్రీకరించారని, మరో రెండు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్‌‌ ఉన్నట్టు సమాచారం.  అందులో ఒకటి హీరో ఇంట్రడక్షన్ కాగా, మరొకటి స్పెషల్ సాంగ్‌‌. అలాగే క్లైమాక్స్‌‌ ఫైట్‌‌ కూడా చిత్రీకరించాల్సి ఉంది.  

ఆగస్టు నెలాఖరులోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్, ఎడిటింగ్  గ్రాఫిక్‌‌ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వీలయినంత త్వరగా సినిమాను పూర్తి చేసి.. ఇన్నోవేటివ్‌‌గా ప్రమోషన్స్‌‌ చేయనున్నారట. పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవికి జంటగా త్రిష నటిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కునాల్ కపూర్ పవర్‌‌‌‌ఫుల్ క్యారెక్టర్ చేస్తుండగా,  సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై  విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా విడుదల కానుంది.