
ఇప్పటి వరకు మాట్లాడే బొమ్మలనే చూశాం.. కాని తాజాగా ఇప్పుడు మాట్లాడే పుస్తకాలు కూడా వచ్చాయి.ప్రపంచంలో ఎన్నో వింతలు.. విశేషాలు ఉన్నాయి. అవి మనకు తెలిసినవి కొన్నయితే.. చాలావరకు తెలియనవే ఉన్నాయి. సోషల్ మీడియాలో రోజుకొక కొత్త వింత వార్తలు చూస్తున్నాం.. ఇప్పుడు తాజాగా భగవద్గీత పుస్తకం మాట్లాడుతుందట.. అంటే బుక్ తెరిస్తే చాలు ఆ పేజీలోని శ్లోకాలను బ్యాక్ గ్రౌండ్ మ్యాజిక్ తో చదువుతుందట.. ఇప్పడు మాట్లాడే భగవద్గీత గురించి తెలుసుకుందాం. . . .
మనం ఇప్పటి వరకు భగవద్గీత చదివాం. ఎవరైనా చెప్తే విన్నాం. కానీ.. ఇప్పుడు మాట్లాడే స్మార్ట్ భగవద్గీత పుస్తకం వచ్చేసింది.
ఈ పుస్తకం కొంటే దాంతోపాటు ఒక డివైజ్ కూడా ఇస్తారు. దానికి పుస్తకంలోని ఏ పేజీ చూపిస్తే ఆ పేజీలోని శ్లోకాలను చదువుతుంది.
స్మార్ట్ భగవద్గీతను ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ రూపొందించింది. ఈ పుస్తకం సెన్సర్లతో పని చేస్తుంది. పుస్తకంతోపాటు ఒక విజ్ డమ్ ఫ్రూట్ ఇస్తారు. అది ఏ పేజీలో ఉంచితే ఆ పేజిలోని శ్లోకాలను చదువుతుంది. అంతేకాదు శ్లోకానికి అనుగుణంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వినిపిస్తుంది.
ALSO READ | Vastu Tips:.. పూజగది వాస్తు: డూప్లెక్స్ హౌస్ లో పూజ గది ఏ అంతస్థులో ఉండాలి..
ఇప్పటితరం వాళ్లలో చాలామందికి భగవద్గీత చదవాలనే ఓపిక ఉండదు. కానీ.. చదవాలనే ఇష్టం మాత్రం ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. ఈ పుస్తకానికి మార్కెట్లో చాలా డిమాండ్
ఉంది.
ప్రస్తుతం ఇది తెలుగు, హిందీ, సంస్కృతం భాషల్లో అందుబాటులో ఉంది. కమలాపూర్ కు చెందిన యువకులు తుమ్మ శరత్, బోది కిషోర్.. టాకింగ్ భగవద్గీతను పదివేల రూపాయలకు కొన్నారు. అయితే.. ఈ పుస్తకాన్ని చూడ్డానికి చాలామంది వాళ్ల ఇంటికి వస్తున్నారు. పుస్తకంతో వచ్చే విజ్ డమ్ ఫ్లూట్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు గంటలపాటు మాట్లాడుతుంది. దీనికి స్పీకర్ ఉంటుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూడా వినొచ్చు. ఈ కంపెనీ త్వరలోనే టాకింగ్ ఖురాన్, బైబిల్ ను కూడా తయారు చేసే ఆలోచనలో ఉంది ఢిల్లీ కంపెనీ . . .
–వెలుగు, లైఫ్–