అమెరికా, ఉక్రెయిన్ మధ్య కీలక చర్చలు

అమెరికా, ఉక్రెయిన్ మధ్య కీలక చర్చలు

కీవ్: రష్యాతో శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికాతో ఉక్రెయిన్ చర్చలు జరపనుంది. మంగళవారం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సౌదీ అరేబియాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ చేరుకున్నారు. ఆయన సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు. ‘‘మేం చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా టీమ్ మంగళవారం అమెరికా టీమ్‌‌‌‌‌‌‌‌తో చర్చలు జరుపుతుంది” అని జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ తెలిపారు. 

ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నదని.. ఈ చర్చల్లో దీనికి సంబంధించిన ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్ సిద్ధం చేస్తామని యూఎస్ మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ చెప్పారు. కాగా, వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ మధ్య వాగ్వాదం తర్వాత రెండు దేశాల మధ్య జరుగుతున్న తొలి మీటింగ్ ఇది.