- హైదరాబాద్‌లో హై రైజ్ ట్రెండ్
- ఏటేటా పెరుగుతున్న మల్టీ స్టోరీ బిల్డింగులు
- 20 అంతస్తులకు మించినవి ఇప్పటికే 70
- ఏడాదిలో మరో 10 స్కై స్క్రాపర్లు రెడీ
- ఈమధ్యే 44 ఫ్లోర్ల బిల్డింగ్‌కు పర్మిషన్
- పెద్ద బిల్డింగ్‌లకు ఈజీ పర్మిషన్ మరో రీజన్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో హై రైజ్ బిల్డింగుల ట్రెండ్ పెరుగుతోంది. సిటీలో పుష్కలమైన ల్యాండ్ బ్యాంక్ ఉన్నా రేట్లు ఎక్కువుండంతో పెద్ద అపార్ట్‌మెంట్‌లవైపు జనం మొగ్గు చూపుతున్నారు. వాళ్ల డిమాండ్‌కు తగ్గట్టే సిటీ చుట్టూ స్కై స్క్రాపర్లు రెడీ అవుతున్నాయి. 20 అంతస్తులకు మించిన మల్టీ స్టోరీ బిల్డింగులు సిటీలో ఇప్పటికే 70కి పైగా ఉండగా ఏడాదిలో మరో 10 బిల్డింగులు ఎంట్రీ ఇవ్వనున్నాయి.
పదేండ్ల కిందటే స్టార్ట్
సిటీలో పెద్ద బిల్డింగుల హవా పదేండ్ల కిందటే మొదలైంది. కానీ అవి అంతగా అందుబాటులోకి రాలేదు. అయితే ఏటేటా భూముల రేట్లు పెరుగుతుండటంతో అపార్ట్‌మెంట్ కల్చర్ బాగా పెరిగింది. 2014లో 23 ఎకరాల విస్తీర్ణంలో స్టార్ట్ చేసిన 30 అంతస్తుల బిల్డింగ్ రియల్ రంగంలో మల్టీ స్టోరీ బిల్డింగులకు కొత్త డిమాండ్ తీసుకొచ్చింది. అప్పటి నుంచి మెల్లెగా పెద్ద అపార్ట్‌మెంట్‌లకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. సిటీలో ఇప్పటివరకు 42 ఫ్లోర్ల బిల్డింగ్ అతిపెద్దది కాగా తాజాగా 44 అంతస్తుల బిల్డింగ్‌కు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. సిటీలో 20కి మించి ఫ్లోర్లు ఉన్న బిల్డింగులు 70 దాటాయి.
అన్నీ ఐటీ కారిడార్‌లోనే..
ఐటీ హబ్‌కు అడ్డా అయిన హైటెక్ సిటీ చుట్టూ హై రైజ్ బిల్డింగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేరే రాష్ట్రాలు, విదేశాల నుంచి సిటీకి వచ్చిన వాళ్లు కోర్ సిటీ కన్నా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, మాదాపూర్, శంషాబాద్ నుంచి గచ్చిబౌలి మార్గంలో ఉండే ఏరియాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లోనే కమర్షియల్, రెసిడెన్షియల్, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు పెరిగాయి. డిమాండ్‌తో పాటు భూముల రేట్లు కూడా బాగా పెరగడంతో ఉన్న కొద్ది ప్లేస్‌లోనే అన్ని సౌకర్యాలుండే హై రైజ్ బిల్డింగులను నిర్మిస్తున్నారు.
పదేళ్లలో ఇవే టాప్
సిటీలో ల్యాంకో హిల్స్‌లో 23 ఫ్లోర్లతో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు 2011లో వచ్చింది. ఆ తర్వాత ఏఎస్‌రావు నగర్‌లో 23 ఫ్లోర్ల మల్టీ స్టోరీ రెసిడెన్షియల్ బిల్డింగ్‌కు 2013లో పర్మిషన్ ఇచ్చారు. అదే ఏడాది కపిల్ నిర్మాణ సంస్థ 23 ఫ్లోర్లతో హై రైజ్ కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఇప్పటివరకు సిటీలో ఎత్తైన బిల్డింగ్ 42 అంతస్తుల లోథా బెల్లెజా. దీన్ని ముంబైకి చెందిన సంస్థ హైటెక్ సిటీ కూకట్‌పల్లి మార్గంలో కట్టింది. తాజాగా బెంగళూరుకు చెందిన సుమధుర సంస్థ 44 ప్లోర్ల బిల్డింగ్‌కు అనుమతి పొందింది. మరో ఏడాదిలో 10కి పైగా కొత్త బిల్డింగులు రావొచ్చని రియల్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 100 ఫోర్ల బిల్డింగ్ కోసం టీఎస్ఐఐసీ, 115 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టేందుకు ల్యాంకో సంస్థలు రెడీ అవుతున్నాయి.
ఓఆర్ఆర్ చుట్టూ..
అన్ని ప్రాంతాలను అనుసంధానంచే లింక్ రోడ్లు ఔటర్ రింగ్ రోడ్డుకు రెండువైపులా 5 కిలోమీటర్ల మేర సిటీ విస్తరించడంతో అక్కడ హై రైజ్ బిల్డింగులకు డిమాండ్ పెరుగుతోంది. సిటీలో భూముల రేట్లు విపరీతంగా పెరుగుతుండటం, 100 గజాల్లో ఇండిపెండెంట్ ఇండ్లు అందుబాటు ధరల్లో లేకపోవడంతో అపార్ట్‌మెంట్‌ల సంఖ్య పెరుగుతోందని రియల్ వర్గాలు చెబుతున్నాయి. హై రైజ్ బిల్డింగులకు ఈజీగా అనుమతి వస్తుండటం కూడా వాటి సంఖ్య పెరగడానికి మరో రీజన్ అని అంటున్నారు.
హై రైజ్ హవా పెరుగుతది
సిటీలో కొన్నేళ్లుగా హై రైజ్ బిల్డింగ్‌ల హవా నడుస్తోంది. వేరే నగరాలతో పోల్చితే ఇక్కడ ఫ్లోర్ స్పేస్ నిష్పత్తిలో పరిమితుల్లేవు. ఫైర్, ఎయిర్ పోర్టు అథారిటీ లాంటి సంస్థల క్లియరెన్స్ వస్తే ఈజీగా హై రైజ్ నిర్మాణానికి అనుమతులు వచ్చే అవకాశం ఉంది. కొనుగోలుదారుల ఆసక్తి, ప్రైమ్ ఏరియా, ల్యాండ్ రేట్‌ను బట్టి బిల్డింగులు కట్టేందుకు పెద్ద కంపెనీలు ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి.
– శ్యామ్ సన్ ఆర్థర్, నైట్ ఫ్రాంక్ కన్సల్టెంట్ బ్రాంచ్ డైరెక్టర్
సిటీలో ఎత్తైన బిల్డింగులివే
బిల్డింగ్ పేరు ఫ్లోర్లు
సమధుర 44
మై హోం భుజా 36
మెరీనా స్కై 32
ఏలియన్స్ స్పేస్ స్టేషన్ 30
For More News..