ఎస్బీఐలో మరో కుంభకోణం... వెలుగులోకి బ్యాంకు మేనేజర్ అక్రమాలు

ఎస్బీఐలో మరో కుంభకోణం బయటపడింది. సూర్యాపేట జిల్లాలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్  5 కోట్ల రూపాయలు కాజేసిన ఘటన మరవక ముందే... నూతనకల్ మండల తాళ్లసింగారం బ్యాంకు మేనేజర్  హరిప్రసాద్ అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బ్యాంకు సమీపంలో ఆధార్ కార్డు నిర్వాహకులు, ఔట్ సోర్సింగ్  సిబ్బంది, ఎఫ్ఓఎస్ నకిలీ ధృవపత్రాలతో సంభావన సంఘాలు,  వ్యవసాయ రుణాలను  మేనేజర్ హరిప్రసాద్ దాదాపుగా  2 కోట్ల రూపాయలు  అక్రమంగా ఖాతాదారుల పేరిట తీసుకొని సమీప బంధువుల ఖాతాలోకి నగదు మళ్లీంచారు.  ప్రస్తుత మేనేజర్ రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కేసు నమోదు చేసేుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

సూర్యాపేట ఎస్బీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ షేక్ సైదులు వినియోగదారుల పేరిట వారికి తెలియకుండా లోన్లు తీశాడు. బాధితుడు శ్యామ్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. ఇంకా సైదులు గతంలో పని చేసిన బ్యాంక్ బ్రాంచ్ ల్లో విచారణ చేస్తున్నారు.  రూ.4.5 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాదారులకు తెలియకుండానే వారి పేర్ల మీద రుణాలు తీసుకున్నాడు. షేక్ సైదులు ఇంకా ఎంతమందిపై బ్యాంక్ రుణాలు తీసుకున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.