హైదరాబాద్, వెలుగు: బిజినెస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్అందించే టాలీ ఎంఎస్ఎంఈ రంగం కోసం కొత్త వెర్షన్ టాలీ 5.0 ప్రైమ్‌ను రిలీజ్చేసింది. దీంట్లో ఏఐ ఫీచర్లతోపాటు జీఎస్టీ ఫైలింగ్, ట్యాక్స్ ఫైలింగ్, ఈ--–ఇన్‌వాయిసింగ్, ఈ–-వే బిల్, వాట్సాప్ ఇంటిగ్రేషన్ఆప్షన్లు ఉంటాయని తెలిపింది. హైదరాబాద్‌లోని ఐటీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొంది.
వ్యాపారాల కోసం డిజిటల్ ఇంటిగ్రేషన్ చేయడానికి టాలీ సొల్యూషన్స్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అంతటా ఎంఎస్ఎంఈలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్త వెర్షన్ధర రూ.20 వేల వరకు ఉంటుంది. ఇది వరకే 4.0 వెర్షన్ వాడుతున్న వాళ్లు ఉచితంగానే కొత్తదానికి అప్‌గ్రేడ్ కావొచ్చు. ప్రస్తుతం 25 లక్షల మంది తమ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారని, ఏటా 30 శాతం సీఏజీఆర్‌ను సాధిస్తున్నామని టాలీ సౌత్ జోన్ జీఎం అనిల్ భార్గవన్ చెప్పారు.