9న సిక్కిం సీఎంగా తమాంగ్ ప్రమాణం

9న సిక్కిం సీఎంగా తమాంగ్ ప్రమాణం

 గ్యాంగ్​టక్: సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్ కేఎమ్) అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్  సిక్కిం సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 9న పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లోని పాల్జోర్ స్టేడియంలో తమాంగ్ తో పాటు మంత్రుల ప్రమాణ కార్యక్రమం జరగనుంది. బుధవారం గ్యాంగ్ టక్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  ‘‘కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవం జూన్ 9న పాల్జోర్ స్టేడియంలో జరుగనుంది. 

ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. పార్టీ ఘన విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు. మా పార్టీపై విశ్వాసం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. కాగా, సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలుండగా  ఎస్ కేఎం 31 సీట్లలో  గెలిచి రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది.