
ఓ వైపు హీరోయిన్‌గా వరుస చిత్రాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తోనూ ఆకట్టుకుంటోంది తమన్నా. తాజాగా అజయ్ దేవగణ్ సినిమా ‘రైడ్ 2’లో ‘నషా’అంటూ సాగే ప్రత్యేక గీతంలో ఆమె చిందేసింది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్.. శుక్రవారం తమన్నా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన పాటను విడుదల చేశారు.
ఎప్పటిలాగే తనదైన ఎక్స్‌ప్రెషన్స్, స్టెప్పులతో ఆకట్టుకుందామె. తమన్నా గ్లామర్‌తో పాటు ఆమె గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యూట్యూబ్ లో ఈ పాట రిలీజైన 20 గంటల్లోపే కోటికిపైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే పదికి పైగా స్పెషల్ సాంగ్స్ చేసిన తమన్నా.. ‘జైలర్’లో నువ్వు కావాలయ్యా అంటూ, ‘స్త్రీ 2’లో ఆజ్ కా రాత్ అంటూ ఆడిపాడి ఆ సినిమాల విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఆమె ‘రైడ్ 2’లోనూ స్పెషల్ సాంగ్ చేసింది కనుక ఆ సక్సెస్ మేజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి!