
Tamannah: ముంబై హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఆమె ప్రియుడు విజయ్ వర్మ మధ్య బ్రేకప్ అయినట్టు వార్తలొస్తున్న సమయంలో వీళ్లి ద్దరూ ఒకే చోట ప్రత్యక్షమవడం ట్రెండింగ్ గా మారింది. బ్రేకప్ సంగతిని వీళ్లిద్దరిలో ఎవరు కూడా అధికారికం గా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ ఇప్పుడు ఒకే చోట కనిపించారు. కాకపోతే వేర్వేరుగానే... హోలీ సం దర్భంగా నటి రవీనా టాండన్ తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది.
తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఇద్దరూ రవీనా టాండన్ ఇంటికి వేర్వేరుగా వచ్చారు. ఇక అక్కడి నుంచి వైరల్ అవుతున్న వీడియోలో, రవీనా ఇంటికి వెళ్ళే ముందు, విజయ్ వర్మ అక్కడ ఉన్న కెమెరా మెన్ తో హోలీ ఆడుతున్నట్లుగా ఉంది. అదే విధంగా అక్కడే తమన్నా భాటియా కూడా మీడియాలో గట్టిగానే ఫోకస్ అయింది. వారిద్దరూ వేర్వేరు సమయాల్లో రవీనా టాండన్ ఇంట్లో ఏర్పాటు చేసిన హోలీ పార్టీకి చేరుకున్నారు. ఇద్దరూ కలిసి కనిపించలేదు. వా ళ్లిద్దరూ రవీనా టాండన్ ఇంట్లో కలిశారా..? లేదా..? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా రా..? హోలీ ఆడుకున్నారా లేదా..? అనే అంశంపై ఎలాంటి సమాచారం లేదు. రవీనా టాండన్ ఇంట్లో వీళ్లిద్దరూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది.
Also Read:-హానీ రోజ్ స్లీవ్ లెస్ డ్రెస్సులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతోంది..
ఈ విషయం ఇలా ఉండగా గతంలో నటి తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరూ హైదరాబాద్ లో ఘనంగా వివాహం చేసుకోబోతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపించాయి.. కానీ ఈమధ్య ఏమైందో ఏమోగానీ తమన్నాతో విజయ్ వర్మ బ్రేకప్ చేసుకున్నాడని అందుకే ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ బ్రేకప్ రూమర్స్ పై మాత్రం ఈ ఇద్దరూ స్పందించకపోవడం గమనార్షం.
మరోవైపు ఈ ఇరువురి తల్లిదండ్రులు వీరి వివాహం కోసం హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ ని కూడా బుక్ చేసారని అలాగే పెళ్లి తర్వాత నివాసం ఉండటానికి ఖరీదైన ఇళ్లు కూడా కొన్నట్లు సమాచారం.. కానీ చివరి నిమిషంలో ఈ బ్రేకప్ రూమర్స్ వినిపిస్తుండటంతో వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళుతుందో లేదోనని మరికొందరు అంటున్నారు.