TamannaahBhatia: ఆజాద్ స్పెషల్ స్క్రీనింగ్‌.. క్యాజువల్ వేర్‌లో తమన్నా, విజయ్ వర్మ ఎంట్రీ.. ఫోటోలు వైరల్

బాలీవుడ్ స్టార్ హీరో కం విలన్ విజయ్ వర్మ (Vijay Varma) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమన్నా(TamannaahBhatia) బాయ్ ఫ్రెండ్గా విజయ్ వర్మ ఎంతో సుపరిచితం. వీరిద్దరూ కలిసి త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు. దీంతో ఈ జంట ఎక్కడ కనిపించిన తమ ఫొటోలతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. 

ఇవాళ జనవరి 17న బాలీవుడ్ కొత్త సినిమా ఆజాద్ థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే, ఆజాద్ మూవీ రిలీజ్ ముందు రోజు జనవరి 16న మేకర్స్ స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆజాద్ మూవీ ప్రీమియర్ చూడటానికి వచ్చారు. అందులో బాలీవుడ్‌లో ప్రసెంట్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్న జంట తమన్నా భాటియా, విజయ్ వర్మ కలిసొచ్చారు. వీరిద్దరూ తమ స్టైలిష్ లుక్స్తో అందరినీ ఆకర్షించారు. క్యాజువల్ వేర్‌లో ఈ జంట మీడియా కంటికి చిక్కింది. థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు ఈ జంట చాలా ప్రేమగా చూస్తున్న ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Also Read :- ఓటీటీలోకి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్

ఇందులో తమన్నా వైట్ కలర్ టీ-షర్టు ధరించింది. ఈ టీ షర్ట్ ముందు భాగంలో 'ఉయ్యి అమ్మ' అని రాసి ఉంది. ఈ టీ-షర్ట్‌లో తమన్నా మరింత అట్రాక్షన్ గా ఉండటంతో నెటిజన్స్ స్పెషల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్‌ వర్మతో మిల్కీబ్యూటీ డేటింగ్ చేస్తున్నారు. తెలుగు, హిందీ సినిమాలతో తమ్మూ బిజీగా ఉంది. ఇటీవలే ‘స్త్రీ 2’మూవీలో స్పెషల్‌ సాంగ్‌తో అలరించింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో ‘ఓదెల 2’లో నటిస్తుంది. మరోవైపు విజయ్‌ 2024లో విడుదలైన ‘ఐసీ 814’లో నటించారు.

ఇకపోతే ఆజాద్ మూవీ విషయానికి వస్తే.. స్టార్ హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ మరియు నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీలు ఈ సినిమాతో లాంచ్ అయ్యారు. ఈ చిత్రానికి అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు.