
తమన్నా నటించిన కొత్త మూవీ ఒదేల 2. ఈ మూవీ గురువారం (ఏప్రిల్ 17న) విడుదలైంది. అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ కు మిక్సెడ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో ఓదెల 2 బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే ఓపెనింగ్స్లో నిరాశ పరిచింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సీక్వెల్ మూవీ, పెద్దగా వసూళ్లు రాబట్టలేదని ట్రేడ్ వర్గాల సమాచారం.
ప్రముఖ ట్రేడ్ సంస్థ సాక్నిల్క్ ప్రకారం.. ఓదెల 2 మూవీ తొలిరోజు గురువారం (ఏప్రిల్ 17న) రూ.85లక్షలు నెట్ సాధించినట్లు తెలిపింది. ఈ మూవీ గురువారం నాటికి ఒదెల 2 మొత్తం 15.65% తెలుగు ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది.
అందులో ఉదయం షోలకి 15.82%, మధ్యాహ్నం 16.79%, సాయంత్రం 14.06%, రాత్రి షోలకి 15.93% ఆక్యుపెన్సీ నమోదైంది. ఓదెల 2 ఫస్ట్ డే గ్రాస్ ఎంతనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, ఓదెల 2 వసూళ్లకు వరుసగా వచ్చిన ఈ వీకెండ్ హాలీడేస్ చాలా ముఖ్యం.
Also Read : ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ ఎంపురాన్
ఈ సినిమా ఫస్టాఫ్ 20 నిమిషాలు ఆకట్టుకున్నప్పటికీ, ఆ తర్వాత సాగే కథకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదని టాక్ నడుస్తోంది. రొటీన్ స్టోరీ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడంతో పాటు VFX ఇంపాక్ట్ ఇవ్వలేదంటూ ఆడియన్స్ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.
ఇకపోతే, ఈ సినిమా వసూళ్ల ఫలితం, నేడు వచ్చిన కళ్యాణ్ రామ్ సినిమా ఫలితంపై కూడా ఆధారపడి ఉంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు టాక్ బాగుంటే వసూళ్లు తగ్గే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
ఇకపోతే, ఓదెల 2కు శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్. సినిమా రిలీజ్ కు ముందే మంచి ధరకు డీల్ జరిగిందట. ఈ సినిమా కోసం నిర్మాతలు రూ.25 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. పెట్టిన బడ్జెట్ రావాలంటే, ఓదెల చాలా పోరాడాల్సి ఉంది.