ఓదెలలో ఫైనల్ షెడ్యూల్

ఓదెలలో ఫైనల్ షెడ్యూల్

ఓ వైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్, గ్లామరస్ రోల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు  లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌‌‌‌‌‌‌‌తో  ఆకట్టుకుంటోంది తమన్నా. ప్రస్తుతం ఆమె ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌లో లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ‘ఓదెల 2’ టైటిల్‌‌‌‌‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దర్శకుడు సంపత్ నంది కథను  అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. మంగళవారం నుంచి ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. 

మొదటి షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను కాశీలో ప్రారంభించగా, ఈ చివరి షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను ఓదెల మల్లన్న క్షేత్రంలో చిత్రీకరించడం ఆనందంగా ఉందని మేకర్స్ చెప్పారు.  మల్లన్న ఆలయంతో పాటు ఓదెల  గ్రామంలోని అందమైన ప్రదేశాలలో  కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో  తమన్నా,  హెబ్బా పటేల్, మురళీ శర్మ సహా  ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఇందులో తమన్నా శివ శక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తోంది. 

మల్టీ లింగ్వల్ ప్రాజెక్టుగా  రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్,  సంపత్ నంది టీమ్‌‌‌‌‌‌‌‌వర్క్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌లపై డి మధు  నిర్మిస్తున్నారు.  ‘కాంతార’ ఫేమ్  అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్  సంగీతం అందిస్తున్నాడు.