'ఓదెల రైల్వే స్టేషన్' ( Odela Railway Station) సినిమా 2022 లో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి..డైరెక్ట్ ఓటీటీ ద్వారా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఇపుడా సినిమాకు సీక్వెల్‌ను తీసుకు వచ్చేందుకు సంపత్ నంది( Sampath Nandi) ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు అశోక్ తేజ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
దర్శకుడు అశోక్ తేజ మొదటి పార్ట్ లోని కొన్ని పాత్రలను తీసుకుని కథను కొనసాగించే విధంగా స్క్రిప్ట్‌ను రెడీ చేసాడట. ఈ సీక్వెల్ కోసం మేకర్స్..హీరోయిన్ తమన్నా(Tamannaah)ను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. సంపత్ నంది, తమన్నా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కాంబోలో రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ సినిమాలు వచ్చాయి. కనుక మరోసారి వీరు కలిసి వర్క్ చేయడంలో అతిశయోక్తి లేదనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఓదెల రైల్వే స్టేషన్లో హెబ్బ పటేల్‌ను డీ గ్లామర్ రోల్లో చూపించిన దర్శకుడు అశోక్ తేజ..సీక్వెల్లో హీరోయిన్ పాత్రను అంతే డీ గ్లామర్‌గా చూపించేలా కథను రాసుకున్నాడా? లేదంటే గ్లామర్ రోల్లో మోడ్రన్ హీరోయిన్ను చూపిస్తాడా? అనేది సస్పెన్స్. సీక్వెల్‌గా రాబోతున్న ఈ సినిమా అయిన థియేట్రికల్ రిలీజ్ అవుతుందా..? లేదా మళ్ళీ ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుందా..? అనేది నిర్మాతే తేల్చాల్సి ఉంది. త్వరలో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.