మైథాలజీ మూవీలో తమన్నా

మైథాలజీ మూవీలో తమన్నా

ఇటీవల ‘ఓదెల 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్నా.. ప్రస్తుతం వరుస బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బిజీగా ఉంది. రేంజర్, రాకేష్ మారియా బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నో ఎంట్రీ 2 చిత్రాల్లో ఆమె నటిస్తోంది. ఇవికాక తాజాగా మరో కొత్త చిత్రానికి ఆమె సైన్ చేసినట్టు సమాచారం. సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్హోత్రా హీరోగా ‘వివాన్’ పేరుతో ఓ చిత్రం రూపొందబోతోంది.  మైథలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కే ఈ చిత్రానికి దీపక్ మిశ్రా దర్శకత్వం వహించనున్నాడు.  ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా తమన్నా నటించబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ నుంచి సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి వెళ్లనుంది. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, అదికూడా ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రానుంది.