ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తమన్నా.. పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే షాకిచ్చిన ప్రేమ జంట..?

ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తమన్నా.. పెళ్లి పీటలు ఎక్కుతారనుకుంటే షాకిచ్చిన ప్రేమ జంట..?

మిల్క్ బ్యూటీ తమన్నా, యాక్టర్ విజయ్ వర్మ జోడి ప్రేమ బంధానికి ముగింపు పలికిందా..? గత కొద్ది రోజులుగా పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన వీరు విడిపోయారా..? లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేసి.. ఫ్రెండ్స్‎గా ఉండాలని నిర్ణయించుకున్నారా..? అంటే బాలీవుడ్ సర్కిల్స్‎తో పాటు.. జాతీయ మీడియాలో వస్తోన్న కథనాలు అవుననే అంటున్నాయి. తమన్నా, విజయ్ జోడి ప్రేమ ప్రేమ బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు గాఢ ప్రేమికులుగా ఉన్న వీరు.. ఇకపై ఫ్రెండ్స్‎గా ఉండాలని డిసైడ్ అయ్యారట. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. లవ్ బ్రేకప్‎పై  విజయ్ కానీ, తమన్నా కానీ అధికారికంగా ప్రకటించలేదు. 

ముంబై హాట్ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్ ద్వారా సినీ ప్రవేశం చేసింది. కెరీర్ తొలినాళ్లలోనే హ్యాపీడేస్, ఆవారా, 100% లవ్, బాహుబలి వంటి చిత్రాల్లో నటించి హీరోయిన్‎గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన యాక్టింగ్, అదిరిపోయే డ్యాన్స్‎లతో తక్కువ కాలంలోనే మిల్క్ బ్యూటీ స్టార్ హీరోయిన్‎గా ఎదిగిపోయింది. స్టార్‎డమ్ రావడంతో బాలీవుడ్‎‎లో అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్లింది తమన్నా. అక్కడ కూడా మిల్క్ బ్యూటీకి బానే కలిసి వచ్చింది. సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బీ టౌన్ ఫ్యాన్స్‎కు దగ్గరైంది. ముఖ్యంగా బోల్డ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ బాలీవుడ్‎లో తమన్నాకు మంచి గుర్తింపు లభించింది.

ఈ సిరీస్ సమయంలోనే సహ నటుడు విజయ్ వర్మతో తమన్నాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. విజయ్, తమన్నా బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. తమన్నా, విజయ్ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోవడంతో ఈ జోడి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఈ లవ్ బర్డ్స్ ఊహించని విధంగా ఫ్యాన్స్‎కు షాకిచ్చారు. కొన్నాళ్లలో పెళ్లి పీటలెక్కుతారనుకుంటే.. సడెన్‎గా విజయ్, తమన్నా విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఇక తమ ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి.. ఇకపై ఫ్రెండ్స్‎గా ఉండాలనుకుంటున్నారట. 

ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమన్నా తీరు కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. డేటింగ్లో ఉన్నప్పుడు తమన్నా బయటకు ఎక్కడికి వెళ్లిన విజయ్‎తో కలిసి వెళ్లేది. కానీ ఇటీవల మిల్క్ బ్యూటీ బయట ఒంటరిగానే కనిపిస్తోంది. ప్రియుడు లేకుండానే పలు కార్యక్రమాలకు అటెండ్ అవుతోంది. దీంతో బ్రేకప్ వార్తలు నిజమేనని ప్రచారం జరుగుతోంది. గత రెండు మూడేళ్లుగా పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన తమన్నా, విజయ్ జోడీ.. సడెన్‎గా విడిపోవడానికి కారణం ఏంటని మూవీ సర్కిల్స్‎లో చర్చ జరుగుతోంది.