తమన్నా- విజయ్ వర్మ పెళ్ళి!.. ఎప్పుడంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా(Thamannaah)తో  విజయ్ వర్మ(Vijay Varma)..ప్రేమాయణం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ టైంలోనే  ప్రేమలో పడిన ఈ లవ్బర్డ్స్ త్వరలో పెళ్ళికి రెడీ అయినట్లు సమాచారం.

గతంలో ఇప్పట్లో పెళ్లి ఆలోచనలు లేవని తమన్నా తెలిపిన..వయసు కూడా పెరిగిపోతుందని..ఇంట్లో పేరెంట్స్ ఒత్తిడితో మ్యారేజ్కు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ సెట్ అయితే..వచ్చే నెల డిసెంబర్ చివరి వారంలో లేదా..జనవరి మొదటి వారంలో వీరిద్దరికీ ఎంగేజ్ మెంట్..ఆ తర్వాత ఫిబ్రవరి లో మ్యారేజ్ జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. 

తమన్నా చాలా సందర్భాల్లో..తన ప్రియుడు గురుంచి మాట్లాడుతూ..విజయ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకేం కావాలో తనకు బాగా తెల్సు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు అండగా ఉంటాడనే నమ్మకం నాకుంది" అంటూ విజయ్ ను తెగ పొగిడేసింది. అంతేకాకుండా..న్యూయర్ సందర్భంగా తమన్నా-విజయ్ వర్మ ముద్దు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..వీళ్ల ప్రేమ వ్యవహారం బయటపడింది.

విజయ్ వర్మ బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెల్సు.. కానీ అతను ఒక తెలుగువాడు, అందులోనూ తెలంగాణాకు చెందిన వ్యక్తి అని చాలా మందికి తెలియదు. విజయ్ వర్మ 1986 మార్చ్ 29న హైదరాబాద్ లో జన్మించాడు. విజయ్ తండ్రి హ్యాండీ క్రాఫ్ట్ బిజినెస్ చేసేవారు, తల్లి హౌజ్ వైఫ్. అతనికి ఇద్దరు అన్నయ్యలు.