మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక స్టార్ కాస్ట్ విషయంలో కూడా ఎక్కడా తగ్గటం లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న టాప్ స్టార్స్ అందరినీ ఈ సినిమా కోసం దింపుతున్నాడు మంచు విష్ణు.
ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో స్టార్ యాడ్ అయ్యారట. అవును.. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకోనున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ఆడియన్స్ కాస్త అవాక్కవుతున్నారు. కన్నప్ప అంటే దైవభక్తితో కూడిన సినిమా కదా. అలాంటి సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్ ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.