అభిమాని చేతిపై తమన్నా టాటూ.. కన్నీళ్లు పెట్టుకున్న మిల్కీ బ్యూటీ

తన వీరాభిమాని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. తాజాగా ఆమె ముంబై ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చారు. దీంతో  ఆమెను చూడాటానికి చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తన అభిమానులతో చాలా క్లోజ్‌గా  ఇంటరాక్ట్ అయ్యారు తమన్నా.

అందులో ఒక అభిమాని తమన్నాను చూడగానే భావోద్వేగానికి లోనయ్యాడు. తమన్నాను కలిసిన తర్వాత ఆమె పాదాలను తాకి, ఒక బొకేతో పాటు లేఖను కూడా ఇచ్చారు. అనంతరం తన చేతిపై వేయించుకున్న పచ్చబొట్టు కూడా చూపించాడు. అది చుసిన తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ టాటూలో 'లవ్ యు ది తమన్నా' అనే పదంతో పాటు తమన్నా ఫోటో కూడా ఉంది. అది చూసి కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా..  ఆ అభిమానిని కౌగిలించుకుని 'ధన్యవాదాలు' తెలిపారు.

ALSO READ:వార్ధా నదిపై హై లెవెల్ బ్రిడ్జి కోసం సర్వే..గుండాయి పేట్ దగ్గర సర్వే ఏజెన్సీ పరిశీలన

ఇక ఈ వీడియో చుసిన చాలా మంది తమన్నాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. "అయ్యో ఈ వీడియో చూస్తుంటే ఏడుపొస్తుంది". "తను బంగారం లాంటి మనిషి 13 ఏళ్లుగా తెలుసు.. అభిమానులను చాలా గౌరవంగా భావింస్తుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.