
టాలీవుడ్ టు బాలీవుడ్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది తమన్నా. మరోవైపు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఈ ఏడాది తెలుగులో ‘ఎఫ్ 3’ చిత్రంలో మెరిసిన ఆమె.. బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ చిత్రాలతో హిందీ ప్రేక్షకులను పలుకరించింది. డిసెంబర్‌లో తను నటించిన మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. సత్యదేవ్‌కు జంటగా ఆమె నటించిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకుడు. భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు పడ్డ ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతోంది.
డిసెంబర్ 9న విడుదల చేయనున్నట్టు శనివారం అనౌన్స్ చేశారు. ఇదొక రొమాంటిక్ డ్రామా. కన్నడలో సక్సెస్ సాధించిన ‘లవ్ మాక్ టెయిల్’కి రీమేక్. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాశారు. మేఘా ఆకాష్, కావ్య శెట్టి, సుహాసినీ మణిరత్నం కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో చిరంజీవికి జంటగా ‘భోళా శంకర్’లో నటిస్తున్న తమన్నా.. హిందీలో మరో రెండు సినిమాలు చేస్తోంది. కాజోల్‌తో కలిసి తను నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో స్ట్రీమ్ అవబోతోంది.