
తమన్నా లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. అశోక్ తేజ దర్శకుడు. డైరెక్టర్ సంపత్ నంది సూపర్ విజన్‌లో డి మధు నిర్మిస్తున్నారు. 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు ఇది సీక్వెల్. నాగ సాధు పాత్రలో తమన్నా నటిస్తోంది. బుధవారం ఈ మూవీ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనెల 22న కాశీ మహా కుంభమేళాలో టీజర్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
కాశీ మహా కుంభమేళాలో లాంచ్ అవబోతున్న ఫస్ట్ టీజర్ ఇదేనని చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కుంభమేళా బ్యాక్ డ్రాప్‌లో నాగసాధు గెటప్‌లో కనిపిస్తోంది తమన్నా. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఎస్. సౌందర్‌రాజన్ సినిమాటోగ్రాఫర్. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.