విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత లవ్ పై తమన్నా సెన్సేషనల్ కామెంట్స్..

విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత లవ్ పై తమన్నా సెన్సేషనల్ కామెంట్స్..

గత కొన్నాళ్లుగా నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న హీరోయిన్ తమన్నా.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే సమయంలో వీళ్లిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓ పాడ్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌కు హాజరైన తమన్నా.. లవ్‌‌‌‌‌‌‌‌ రిలేషన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రేమ, రిలేషన్‌‌‌‌‌‌‌‌ విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది.  లవ్ ఎప్పుడూ అన్‌‌‌‌‌‌‌‌కండిషనల్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి. 

ఆ ప్రేమను మనం ఫీల్ అవ్వాలి. అది వన్‌‌‌‌‌‌‌‌ సైడెడ్‌‌‌‌‌‌‌‌ కూడా కావొచ్చు. పార్టనర్స్‌‌‌‌‌‌‌‌ మనకు నచ్చినట్టు ఉండాలని, మనం చెప్పిందే చేయాలని షరతులు పెట్టడం బిజినెస్ లావాదేవీ అవుతుంది తప్ప ప్రేమ కాదు. నేనెవరినైనా ప్రేమిస్తే వారిని స్వేచ్ఛగా ఉండనిస్తా, వారికి నచ్చినట్టుగా బ్రతకనిస్తాను. సింగిల్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పటి కంటే రిలేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడు నేను ఎక్కువ సంతోషంగా ఉన్నా. మనకు ఒకరు తోడు ఉన్నారనేది అద్భుతమైన ఫీలింగ్. కానీ అది ఎవరితో అనేది ముఖ్యం. 

ఎందుకంటే వాళ్లు మన జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. తల్లిదండ్రులను మనం ఎంపిక చేసుకోలేం. కానీ లైఫ్ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్రెండ్స్ సర్కిల్‌‌‌‌‌‌‌‌ను మనం ఎంచుకోవచ్చు. అందుకే తెలివిగా ఆలోచించి ముందడుగు వేయాలి’ అని చెప్పింది తమన్నా. ‘లస్ట్‌‌‌‌‌‌‌‌ స్టోరీస్‌‌‌‌‌‌‌‌ 2’ కోసం ఫస్ట్ టైమ్ కలిసి వర్క్ చేసిన తమన్నా, విజయ్ వర్మ..  షూటింగ్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వాళ్లే రివీల్ చేశారు. తాజాగా వీళ్లిద్దరూ విడిపోయారని, పార్టనర్స్‌‌‌‌‌‌‌‌గా విడిపోయినా స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.