సినిమా నటులు వారు చేసిన ఏ చిత్రానికైనా పారితోషికం తీసుకుంటారు. అది అంతా ఇంతా కాదు కోట్లలో ఉంటుంది. ఈ విషయం సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క సారి తెర పైన వారి బొమ్మ కనపడగానే ఇక వారి జాతకం టర్న్ అయినట్టే. సినిమాల నుంచి తీసుకునే పారితోషికంతో పాటు వారికి ప్రముఖ కంపెనీల నుంచి ప్రమోషన్స్ అదేనండి యాడ్స్ చేయమని ఆఫర్లు కూడా ఇస్తాయి.
నటులు ఎంతా పెద్ద స్టార్ అయితే అంత ఎక్కువ డబ్బులు చెల్లించి తమ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటారు కంపెనీ యజమానులు. ఈ క్రమంలోనే మన స్టార్స్ కొన్ని పనికొచ్చే యాడ్స్ చేస్తే మరికొన్ని సమాజహితమైన యాడ్స్ చేస్తారు. దేనికి తగ్గట్టుగానే దానికి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులోకి స్టార్ హీరోయిన్ తమన్నా బాటియా వచ్చి చేరారు. బ్యాన్ చేసిన ఓ జూదం యాప్ ను తమన్నా ప్రమోట్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది కూడా తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో పోస్టు చేయడంతో చర్చనీయాంశం అయ్యింది.
ఆ వీడియోలో "అక్కడ ఇక్కడా కాదు ఈ వెబ్ సైట్ లో గ్యాంబ్లింగ్ గేమ్ ఆడండని ప్రేక్షకులకు తమన్నా సలహా ఇచ్చింది. ఇందులో మీరు జాయిన్ కాగానే 4 వందల శాతం బోనస్ కూడా వస్తుందని చెప్పింది. ప్రతి రూ. 50 వేల డిపాజిట్ కి 5 శాతం బోనస్ కూడా వస్తుందని తెలిపింది. అంతేకాక అందులో పదుల సంఖ్యలో ఇతర గేమ్స్ కూడా ఉన్నాయని చెప్పింది.
తమన్నా చేసిన ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ యాడ్ తో తమన్న తన ఫ్యాన్ కు షాక్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరోయిన్ అయ్యుండి ఇలాంటి నిషేధిత యాడ్స్ చేయడం ఏంటని నెటీజన్లు గరం గరం అవుతున్నారు. తమను ప్రలోభాలకు గురి చేసేల యాడ్ తీశారని మండిపడుతున్నారు. డబ్బులు ఇస్తే ఎలాంటి యాడ్ చేయడానికైనా ఒప్పుకుంటారా అని నిలదీస్తున్నారు. మరి దీని పై తమన్నా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే తమన్న ప్రస్తుతం అరన్ మనయ్ (తమిళ), వేద (హిందీ) వంటి చిత్రాల్లో నటిస్తుంది.