Odela 2 Teaser: ఇంట్రెస్టింగ్ గా ఓదెల 2 ట్రైలర్ .. లేడీ అఘోరిగా తమన్నా మరో అరుంధతి అవుతుందా..?

Odela 2 Teaser: ఇంట్రెస్టింగ్ గా ఓదెల 2 ట్రైలర్  .. లేడీ అఘోరిగా తమన్నా మరో అరుంధతి అవుతుందా..?

టాలీవుడ్ ప్రముఖ్ డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు మేకర్స్ 'ఓదెల 2" టీజర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ విశేషాలేంటో చూసేద్దాం.. 

మొదటగా ఢమురకం, సైకిల్ బెల్ సౌండ్స్ బీజియంతో శివలింగం, నంది విజువల్స్ తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత లేడీ అఘోరి పాత్రలో తమన్నా ఎంట్రీ ఇచ్చింది. మొదటి పార్ట్ లో హత్య చేయబడిన వశిష్ట ఎన్ సింహ ఆత్మ దయ్యంగా మారిన కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. మధ్యమధ్యలో హెబ్బా పటేల్ తోపాటూ మొదటి పార్ట్ లోని కొన్ని సీన్స్ ని ఇంటర్ లింక్ చేశారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేతబడులు చేసే వ్యక్తి పాత్రలో కనిపించగా, మురళి శర్మ ముల్లా సాబ్ పాత్రలో కనిపించాడు. చివరిలో నీరు నిప్పు, గాలి అన్నీ నాకు దాసోహమే అంటూ డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది.. 

అయితే ఈ టీజర్ లోని కొన్ని సీన్స్, పాత్రలని అరుంధతి సినిమా గుర్తుస్తోంది. ముఖ్యంగా విలన్ ని చంపిన తర్వాత ఆత్మ ప్రేతాత్మ గా మారడం, మురళి శర్మ ముల్లా క్యారెక్టర్ ఇవన్నీ కూడా కొంతమేర చూసినట్లు అనిపిస్తుంది. కానీ విజువల్స్, స్క్రేన్ ప్లే మాత్రం డైరెక్టర్ సంపత్ నంది అదరగొట్టాడు. అలాగే టీజర్ లో నటీనటులకు ఒక్క డైలాగ్ కూడా  లేకపోయినప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ బి. అజనీష్ లోకనాథ్ పర్ఫెక్ట్ గా బీజియం ని సింక్ చేస్తూ హైప్ పెంచాడు. తమన్నా లేడీ అఘోరి పాత్రలో అదరగొట్టింది. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వశిష్ట ఎన్ సింహ చక్కగా అలరించాడు. ఓవరాల్ గా మంచి ఇంటెన్సివ్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన టీజర్ ఓదెల 2 పై అంచనాలు పెంచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ALSO READ | సెల్ఫీ పేరుతో హీరోయిన్ కి పబ్లిక్ లో ముద్దు పెట్టబోయిన ఫ్యాన్.. చివరికి ఏమైందంటే.?