Odela 2 Trailer Talk: ఇక నుంచి శివ నామ స్మరణ కాదు.. శవ నామ స్మరణ అంటూ..

Odela 2 Trailer Talk:  ఇక నుంచి శివ నామ స్మరణ కాదు.. శవ నామ స్మరణ అంటూ..

టాలీవుడ్ ప్రముఖ్ డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మంగళవారం (ఏప్రిల్ 8) మేకర్స్ 'ఓదెల 2" ట్రైలర్ ని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ విశేషాలేంటో చూసేద్దాం.. 

మొదటగా  ఓదెల గ్రామం విజువల్స్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో భరత ఖండమున అనే వాయిస్ తో సాగే డైలాగ్ ఆకట్టుకుంది. లేడీ అఘోరీగా కనిపించిన తమన్నా గోమాత గురించి చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి.సైకిల్ బెల్ సౌండ్స్ బీజియంతో శివలింగం, నంది విజువల్స్, నటుడు వశిష్ట ఎన్ సింహ ఆత్మ దయ్యంగా సీన్స్ ఆసక్తిని పెంచాయి. 

Also Read : ఇంట్లోనే కేక్ కట్ చేసిన అల్లు అర్జున్

మధ్యమధ్యలో హెబ్బా పటేల్ తోపాటూ మొదటి పార్ట్ లోని కొన్ని సీన్స్ ని ఇంటర్ లింక్ చేశారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేతబడులు చేసే వ్యక్తి పాత్రలో కనిపించగా, మురళి శర్మ ముల్లా సాబ్ పాత్రలో కనిపించాడు.  ఓవరాల్ గా థ్రిల్లింగ్ సస్పెన్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఓదెల 2 పై ఆసక్తిని పెంచింది. ఓదెల 2 సినిమా ఏప్రల్ 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.