నెగెటివ్ కామెంట్స్.. కానీ సారీ

నెగెటివ్ కామెంట్స్.. కానీ సారీ

హీరోయిన్ తమన్నా డ్యాన్స్‌‌ గురించి తమిళ దర్శకుడు,  నటుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ వైరల్‌‌ అయ్యాయి. ప్రస్తుతం సినిమాల పరిస్థితి చూస్తుంటే..  తమన్నా డ్యాన్స్ ఉంటే చాలు..  సినిమాలో కథ లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆయన ఇటీవల కామెంట్ చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పారు.  సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అందరిపైనా తనకు గౌరవం ఉందని, నటీనటులను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు.

ఒకవేళ తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని పార్తిబన్  కోరారు. ఆయన దర్శకత్వం వహించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘టిన్జ్‌‌’ ఈ నెల 12న విడుదలైంది.  ఈ సినిమా సక్సెస్‌‌ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తమన్నా డ్యాన్స్‌‌పై కామెంట్స్ చేశారు. రజనీకాంత్ ‘జైలర్‌‌‌‌’లో తమన్నా చేసిన ‘నువ్వు కావాలయ్యా’ అనే స్పెషల్ సాంగ్‌‌ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

అలాగే ఇటీవల వచ్చిన ‘బాక్‌‌’ సినిమాలో రాశీఖన్నాతో కలిసి తమన్నా చేసిన ప్రమోషనల్ సాంగ్‌‌ కూడా ఆ సినిమా విజయానికి ఎంతో హెల్ప్ అయింది. ఈ పాటలను ఉద్దేశించే పార్తిబన్‌‌ కామెంట్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు హిందీ చిత్రం ‘స్త్రీ 2’లోనూ తమన్నా స్పెషల్‌‌ సాంగ్ చేసింది. రీసెంట్‌‌గా రిలీజైన ట్రైలర్‌‌‌‌లోని తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి.