గుండెపోటుతో మృతిచెందిన జైలర్ నటుడు

గుండెపోటుతో మృతిచెందిన జైలర్ నటుడు

ప్రముఖ తమిళ నటుడు మారిముత్తు(Marimuthu) గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

మారిముత్తు అజయ్ హీరోగా వచ్చిన వాలి సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. వరుసగా ఆఫర్స్ అందుకున్నారు మారిముత్తు. తమిళ్ లో దాదాపు 80 సినిమాలకు పైగా నటించి ఆయన.. ఆతరువాత సీరియల్స్ లో కూడా నటించారు.

Also Read :- మాజీ బాయ్ఫ్రెండ్ను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న రతిక

ఇటీవల వచ్చిన సూపర్ హిట్ మూవీ జైలర్ సినిమాలో విలన్ పక్కనే ఉండే పాత్రలో కనిపించారు మారిముత్తు. ఇదే ఆయనకు చివరి సినిమా. 56 ఏళ్ళ వయసులో ఆయన హఠాత్తుగా మరణించడంతో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది.