నటుడు మోహన్ కన్నుమూత.. రోడ్డుపక్కన మృతదేహం

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకొంది. పలు సినిమాల్లో సహాయక నటుడిగా చేసిన తమిళ నటుడు మోహన్(Mohan) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతదేహం తమిళనాడులోని మధురై జిల్లా తిరుప్పాంగుండ్రం రోడ్డు పక్కన లభించిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టాన్ నిర్వహించారు. సేలం జిల్లా మేటూర్‌ లో ఉండే మోహన్.. మధురై ఎందుకు వెళ్ళారు, అక్కడ ఎలా చనిపోయారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

కమల్ హాసన్ హీరోగా వచ్చిన విచిత్ర సోదరులు(Vichitra sodarulu) సినిమాలో ఆయన మరుగుజ్జు స్నేహితుడిగా నడిచారు మోహన్. ఆతరువాత అదిశయ మనిదర్‌గళ్‌‌(Adishayam munidargal), నాన్‌ కడవుల్‌(Nan kaduval) లాంటి సినిమాల్లో కూడా నటించారు.  ఇక మోహన్ మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.