రెండో పెళ్ళికి సిద్దమవుతున్న స్టార్ యాక్టర్ కూతురు

రెండో పెళ్ళికి సిద్దమవుతున్న స్టార్ యాక్టర్ కూతురు

ప్రముఖ తమిళ నటుడు ప్రభు(Prabhu) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ప్రస్తుతం తండ్రిగా, కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సౌత్ లో దాదాపు అన్ని ఇండస్ట్రీలో పనిచేశారు ప్రభు. ఇక ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు విక్రమ్, కూతురు ఐశ్వర్య. 

ప్రస్తుతం ప్రభు కొడుకు విక్రమ్ తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే విక్రమ్ ఇరుకప్పపుట్టు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ సంయమలోనే ఆ చిత్ర దర్శకుడు అదిక్ రవిచంద్రన్, ప్రభు కూతురు ఐశ్వర్య ప్రేమలో పడ్డారట. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. 

అయితే ఐశ్వర్యకు ఇప్పటికే పెళ్లి అయ్యింది. తమ బంధువులు కునాల్ తో 2009లోనే ఆమెకు వివాహం జరిగింది. కానీ.. కొంత కాలానికి    భర్తతో ఏర్పడిన విభేదాల వల్ల అతనితో విడాకులు తీసుకుంది ఐశ్వర్య. కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్న ఐశ్వర్య దర్శకుడు అదిక్ రవిచంద్రన్ ను ప్రేమించారు. తన అన్న సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట వైరల్ గా మారింది.