![నటుడు సత్యరాజ్ ఇంట విషాదం](https://static.v6velugu.com/uploads/2023/08/Tamil-actor-Sathyaraj-mother-passed-away_ZA3UQTLady.jpg)
తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్(Sathyaraj) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్(Naadambal Kalingarayar) కన్నుమూశారు. 94 ఏళ్లు వయసున్న ఆమె గతకొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ 2023 ఆగస్టు 11 శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాదాంబాళ్ కాళింగరాయర్‌కు కొడుకు సత్యరాజ్‌తో పాటుగా ఇద్దరు కుమార్తెలు కల్పనా మండ్రాడియార్, రూపా సేనాధిపతి కూడా ఉన్నారు.
హైదరాబాద్‌లో షూటింగ్ లో ఉన్న సత్యరాజ్.. తల్లి మరణవార్త తెలియగానే వెంటనే కోయంబత్తూరుకు చేరుకున్నారు. సత్యరాజ్‌కు తల్లి నాదాంబాళ్ కాళింగరాయర్ అంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని చాలా ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చారు సత్యరాజ్. తల్లి మరణంతో ఆయన తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు సత్యరాజ్. ఆయన తల్లి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.